News5am, Breaking News Latest Telugu (31-05-2025): ఆపరేషన్ సిందూర్ సందర్భంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్ తొలిసారిగా స్పందించారు. నాలుగు రోజులు సంఘర్షణ అణుయుద్ధం స్థాయికి చేరుకోలేని ఆయన చెప్పారు. భారత ఫైటర్ జెట్లు కూలిపోవడంపై పాకిస్తాన్ చేస్తున్న వాదనలను ఆయన ఖండించారు. “జెట్లు ఎందుకు కూలిపోతున్నాయనేది ముఖ్యం, సంఖ్య కాదు” అని చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ఆరోపణలపై మాట్లాడారు. భారత్ ఎన్ని జెట్లు కోల్పోయిందన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ, వ్యూహాత్మక తప్పులను గుర్తించి, రెండు రోజుల్లోనే సరిచేసే స్థాయికి వచ్చామని పేర్కొన్నారు. మళ్లీ జెట్లు ఎగరగలిగే స్థాయిలో సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పిన ఆరు భారత జెట్లు కూల్చేశామన్న వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించలేదు. అణుయుద్ధాన్ని నివారించడంలో అమెరికా సహాయం చేసిందన్న ట్రంప్ వ్యాఖ్యలపై కూడా చౌహాన్ స్పందించలేదు. అయితే, పాకిస్తాన్ వినియోగించిన చైనా ఆయుధాలు ప్రభావితం చేయలేదని తెలిపారు. భారత్ 300 కిమీ దూరంలోని పాక్ వైమానిక స్థావరాన్ని ఖచ్చితంగా లక్ష్యంగా చేసిందని చెప్పారు. స్వాతంత్ర్యం సమయంలో అన్ని రంగాల్లో ముందుండిన పాకిస్తాన్, ఇప్పుడు అన్ని రంగాల్లో వెనకపడిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆకాష్ క్షిపణి వ్యవస్థ విజయవంతంగా పనిచేసిందని తెలిపారు.
More Updates:
Latest News Telugu News Breaking
భారత నేవీ తలుచుకుంటే పాకిస్తాన్ 4 ముక్కలు అయ్యేది..
నిమిషాల్లో పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం, ఇదే నవ భారత బలం: ప్రధాని
More Telugu News: External Sources
ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..