News5am, Breaking Telugu News (30-05-2025): 1971 భారత–పాకిస్తాన్ యుద్ధాన్ని గుర్తు చేస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో భారత నౌకాదళం పాకిస్తాన్‌ను రెండుగా విడగొట్టింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ తన సంపూర్ణ బలాన్ని ప్రదర్శించి ఉండి ఉంటే, అప్పటికే పాకిస్తాన్ రెండు కాదు, నాలుగు ముక్కలయ్యేది’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ప్రాథమిక దశ మాత్రమేనని హెచ్చరించారు. పాకిస్తాన్ మరోసారి దుష్కార్యాలకు పాల్పడితే, ఈసారి నౌకాదళం కూడా సిద్ధంగా ఉందని, అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడికే తెలుసని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నౌకాదళం తక్షణమే మరియు ధైర్యంగా స్పందించిందని రాజ్‌నాథ్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే సముద్రంలో మన బలగాలు మోహరించాయని చెప్పారు. సర్ఫేస్ టూ సర్ఫేస్, సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైళ్లను విజయవంతంగా పరీక్షించామని పేర్కొన్నారు. సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడం మన దేశపు దృఢ సంకల్పానికి, సిద్ధతకు సంకేతమని, ఇది పాకిస్తాన్‌ను రక్షణాత్మక దిశలోకి నెట్టిందని అన్నారు.
More Breaking Telugu News National:
Breaking News:
4 సరిహద్దు రాష్ట్రాల్లో రేపు కసరత్తులు..
More Telugu News: External Sources
‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది”..