Breaking Telugu News 3

News5am,Breaking Telugu Newsline (14-05-2025): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవలి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ‘ఆపరేషన్ సిందూర్’పై కీలక చర్చలు జరిగాయి. ఆపరేషన్‌కు సంబంధించిన వ్యూహాలు, అమలు విధానం, ఫలితాలను సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి సమర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, సమన్వయం, సంకల్పాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు. జవాన్ల త్యాగం, దేశ భద్రత కోసం వారు చేస్తున్న నిరంతర కృషి ప్రాశస్యంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దేశ రక్షణ విషయంలో త్రివిధ దళాల దృఢతను రాష్ట్రపతి కొనియాడారు.

“రక్షణ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని ఆపరేషన్ సిందూర్‌పై సమగ్రమైన నివేదిక అందించారు. ఉగ్రవాదానికి భారతదేశం ఇచ్చిన గట్టి ప్రతిస్పందన, దీనిని విజయవంతంగా మారుస్తూ సైనిక బలగాలు ప్రదర్శించిన శౌర్యాన్ని రాష్ట్రపతి ముర్ము అభినందించారు” అని రాష్ట్రపతి భవన్ తన ట్వీట్‌లో వెల్లడించింది.

More Telugu Newsline:

నేడు 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..

ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 24 ఎన్డీఏ కీలక భేటీ..

More Breaking Telugu Newsline: External Sources

Droupadi Murmu: రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *