బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. విస్తరణలో భాగంగా వచ్చే ఎనిమిది నెలల్లో ఏపీలోని తుళ్లూరులో ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ విభాగం ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ధైర్యం ఉంటే క్యాన్సర్ బాధితులు తప్పకుండా కోలుకుంటారని బాలకృష్ణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *