Cloudburst In Uttarakhand

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ జరిగింది. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా వరదలు ఉద్ధృతమయ్యాయి. వరద నీటితో అనేక ఇళ్లు మునిగిపోయాయి. వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద చిక్కుకుని మరణించింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ వరదల్లో కొందరు అదృశ్యమైనట్లు సమాచారం.

ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి స్పందించి, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని కోరారు.

Internal Links:

రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ..

నేడు మోడీ అధ్యక్షతన హై-లెవల్ భేటీ..

External Links:

ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *