BJP Parliamentary Board Meeting

BJP Parliamentary Board Meeting: బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం సమావేశమై ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనుంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ సమయానికి ముందుగానే అభ్యర్థిని ప్రకటించడానికి వ్యూహాలు రచిస్తోంది. బీజేపీకి రాజ్యసభలో 102 సీట్లు ఉండగా, మిత్రపక్షాలతో కలిపి 132 సీట్లు, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో మొత్తం 139 సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు ఉండగా, మిత్రపక్షాలతో కలిపి 293 మంది బలం ఉంది. దీంతో ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోవడం బీజేపీకి పెద్ద సమస్య కానుందని అంచనా. తటస్థంగా ఉండే బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి పార్టీల మద్దతు కూడా కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ ఈ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిని మద్దతు ఇవ్వడం వల్ల మరోసారి అదే విధంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు, అనుభవజ్ఞులైన పార్లమెంటేరియన్లు నేతృత్వం వహించనున్నారు. ఎంపీల బాధ్యతలు, విధులపై సూచనలు ఇవ్వడంతో పాటు, సెప్టెంబర్ 8న మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఓటింగ్ ప్రక్రియలో అనుభవం కలిగించడమే దీని ఉద్దేశ్యం. మరోవైపు, ఎన్డీఏ అభ్యర్థి ఎంపికైన వెంటనే ఇండియా కూటమి కూడా ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మల్లిఖార్జున ఖర్గే ప్రతిపక్ష పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా బీజేపీ ఆధిపత్యాన్ని దెబ్బతీయడం కష్టమని అంచనా. అయినప్పటికీ, ప్రతిపక్షం తమ ఐక్యతను ప్రదర్శించేందుకు ఈ ఎన్నికను అవకాశంగా తీసుకుంటోంది.

Internal Links:

నేడు మోడీ అధ్యక్షతన హై-లెవల్ భేటీ..

మోదీ కోసం చేతితో రాఖీ తయారుచేసిన పాకిస్థాన్ సోదరి..

External Links:

రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *