Continuous steady showers: హైదరాబాద్‌లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా మెహిదీపట్నం–గచ్చిబౌలి మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రాయదుర్గం కిమ్స్ ఆస్పత్రి సమీపంలో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే లింగంపల్లి–హెచ్‌సీయూ రూట్‌లో రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. కొండాపూర్ RTA కార్యాలయం నుంచి కొత్తగూడ వరకు, BHEL నుంచి నల్లగండ్ల ఫ్లైఓవర్ వరకు కూడా ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
హైదరాబాద్ లో కంటిన్యూగా ముసురు…ఐటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్…