Meerut Blue Drum Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇద్దరూ అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. మంగళవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, అప్పీళ్లను స్వీకరించి తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
ఈ కేసులో ముస్కాన్, సాహిల్ కలిసి ముస్కాన్ భర్త సౌరవ్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, అతడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బ్లూ డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో కప్పివేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మీరట్ కోర్టు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ సలీల్ కుమార్ రాయ్, జస్టిస్ పదమ్ నారాయణ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.