Supreme Court: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఎన్నికల సంఘం పనితీరుపై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 17న జరిగే అవకాశం ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండిస్తూ, SIR ఉత్తర్వులు ఏకగ్రీవంగా తీసుకున్నవేనని స్పష్టం చేసింది.

ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని, మ్యాపింగ్ కాని ఓటర్ల ఇళ్లకు BLOలు వెళ్లి పత్రాలు సేకరిస్తారని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపులు ERO ఆదేశాల మేరకే జరుగుతాయని పేర్కొంది. ప్రక్రియ పర్యవేక్షణకు IIT, IISc నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని స్పష్టం చేసింది.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *