CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కులు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని వైసీపీపై ఆరోపణలు చేశారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అధికారికంగా బీ-ఫారం పొందిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేయాలని, రెబల్స్‌గా బరిలోకి దిగితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండేళ్ల పాలనను పరిశీలించి కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!