AP Local Body Elections

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల్లో మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులతో కలిసి వెళ్లాలని, వైసీపీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు.

మరోవైపు, గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల ఎంపికపై టీడీపీలో ఇంకా స్పష్టత రాలేదు. పలువురు నేతలు పోటీలో ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెండో జాబితా కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు రేపటితో ముగియనుండటంతో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ పెరిగింది. రెండో జాబితా విడుదలతో ఈ ఉత్కంఠకు తెరపడుతుందా అనేది వేచి చూడాలి.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌.. ఎన్నికల వ్యూహంపై చర్చ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *