Hyderabad: హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నగరంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, నాచారం ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. నిన్న మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్న తన స్నేహితులను కలిసిన అనంతరం, సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ బ్రిడ్జిపై నడుస్తూ అకస్మాత్తుగా చెరువులోకి దూకాడు. ఈ ఘటనను గమనించిన పర్యాటకులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాజేష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు NDRF, DRF బృందాలు బోట్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే, రాజేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పని ఒత్తిడి లేదా వ్యక్తిగత సమస్యలు కారణమై ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..