Public Examinations Act: నీట్ (NEET) పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’కు సవరణలు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, దోషులకు మరింత కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ సవరణ బిల్లుకు త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు, గత పదేళ్లలో జరిగిన పేపర్ లీకేజీల్లో ఎవరికి శిక్ష పడలేదని ప్రతిపక్షాలు కేంద్రాన్ని విమర్శిస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతినకుండా వెంటనే పరీక్షలు నిర్వహించామని ప్రధాని మోడీ తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..