Xi Jinping India Visit: ఏడేళ్ల విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు వచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరిగే ఈ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీపై అందరి దృష్టి నెలకొంది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఈ భేటీలో వాణిజ్యం, సరిహద్దు వివాదాలు, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ప్రస్తుతం 11 సభ్య దేశాలతో ఉన్న బ్రిక్స్ కూటమికి 2026లో భారత్ అధ్యక్షత వహిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సులో ఆర్థిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఇంధన, ఆహార భద్రతతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలపై చర్చించనున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతల మధ్య జరుగుతున్న ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..