Dhee 10 Raju Arrested

Dhee 10 Raju Arrested: ‘ఢీ 10’ విన్నర్‌గా గుర్తింపు పొందిన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ రాజు వివాదంలో చిక్కుకున్నాడు. ఒక యువతిని లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఆమె మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నెల 9న రాజుపై కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

అయితే, రాజుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన విషయాన్ని మియాపూర్ పోలీసులు ఇన్ని రోజులు గోప్యంగా ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి కేసుల వివరాలు వెంటనే బయటకు వస్తాయి. కానీ ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బుల్లితెర వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాజు జైలులో ఉండగా, ఈ కేసు వివరాలను ఎందుకు రహస్యంగా ఉంచారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

లైంగిక వేధింపులు.. ఢీ రాజు అరెస్ట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *