Reliance Group: జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్లో 21 శాతానికి పైగా ప్రీమియంతో రూ.1,358 వద్ద లిస్ట్ కావడంతో రిలయన్స్ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ రూ.30.5 లక్షల కోట్లను దాటింది. దీంతో టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన కార్పొరేట్ గ్రూప్‌గా నిలిచింది. జియో మార్కెట్ విలువ రూ.12.50 లక్షల కోట్లకు చేరగా, భారతీ ఎయిర్టెల్ టెలికాం రంగంలో మూడో స్థానానికి పడిపోయింది.
మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో రూ.30,049 కోట్ల నికర లాభం, రూ.1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. జియో ఐపీఓ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 66.4 శాతం నుంచి 64.5 శాతానికి తగ్గింది. మరోవైపు, టీసీఎస్, టైటాన్, టాటా స్టీల్ వంటి కంపెనీలతో టాటా గ్రూప్ రెండో స్థానానికి పరిమితమైంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!