UP MLC Election Results: ఉత్తరప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు 8 స్థానాల ఫలితాలు వెలువడగా, బీజేపీ 5, ఎస్పీ 3 స్థానాల్లో గెలిచాయి. మిగిలిన 3 స్థానాల్లో ఎస్పీ రెండింటిలో, బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. వారణాసి టీచర్స్ స్థానంలో ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ సుమారు 4,900 ఓట్ల మెజారిటీతో గెలవగా, ఆగ్రా టీచర్స్, ఝాన్సీ గ్రాడ్యుయేట్ స్థానాలను కూడా ఎస్పీ కైవసం చేసుకుంది.
మరోవైపు, మీరట్, లక్నో టీచర్స్, బరేలీ-మొరాదాబాద్ టీచర్స్, ఆగ్రా గ్రాడ్యుయేట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బరేలీ-మొరాదాబాద్‌లో బీజేపీ అభ్యర్థి హరి సింగ్ ధిల్లాన్ 17,676 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గోరఖ్‌పూర్ టీచర్స్ స్థానంలోనూ బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఆగ్రాలో గెలిచిన ఎస్పీ అభ్యర్థి ఆకాశ్ అగర్వాల్‌పై దాడి జరిగిందనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, అభ్యర్థికి వెంటనే ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందించాలని డిమాండ్ చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..