DRDO Scientist: DRDOకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)లో పనిచేస్తున్న 47 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త శరద్ కటియార్ అక్టోబర్ 21న బెంగళూరులో మృతి చెందారు. గత నెల రోజులుగా పని ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనకు ముందు నిమ్హాన్స్‌లో మానసిక వైద్య నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు. పోలీసులు అసహజ మరణ నివేదిక నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, పని ఒత్తిడే మృతికి కారణమని చెప్పలేమని ADA అధికారి కృష్ణ రాజేంద్ర పేర్కొన్నారు. ఉద్యోగులకు సాధారణ పని వేళలే ఉంటాయని, వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఈ ఘటనతో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, పని ఒత్తిడిపై చర్చ మొదలైంది. మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

ఆ కారణంతో.. బెంగళూరులో DRDO శాస్త్రవేత్త ఆత్మహ*త్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *