Fire at Tiger Shroffs Car: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్లో రాజస్థాన్ పోలీసులు, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ కలిసి వారిని పట్టుకున్నారు. నిందితులను ఫూల్ సింగ్, రేహన్, హృతిక్ కుమార్‌గా గుర్తించారు. ముంబైలోని జుహూ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఆయన డ్రైవర్ ఫిర్దౌస్, మరో ఆటో డ్రైవర్ చౌహాన్ గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితులను ముంబైకి తీసుకెళ్లి పోలీసులు విచారించనున్నారు.
ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వాయిస్ నోట్లు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసేవారికి ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ వార్తలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ముంబై క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
ముంబైలో కాల్పులు.. రాజస్థాన్‌లో అరెస్ట్.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో బిగ్ అప్డేట్