Ponnuru Mother Murder Case

Ponnuru Mother Murder Case: కన్న తల్లినే కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసిందనే ఆరోపణలు గుంటూరు జిల్లా పొన్నూరులో కలకలం రేపాయి. పొన్నూరు 8వ వార్డులో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళ మృతిచెందింది. లక్ష్మికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమార్తె పుష్పలత ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగినప్పటికీ ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. కొంతకాలంగా రాజా అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు.

రెండు రోజుల క్రితం లక్ష్మి తన బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు సమాచారం. ఆ డబ్బులు తనకు ఇవ్వాలని పుష్పలత కోరగా, లక్ష్మి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి తల్లి లక్ష్మిని హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పొన్నూరు అర్బన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య

ఎర్రకోటలో భారీ చోరీ…

External Links:

గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *