Ujjain Khada Hanuman Idol: ఉజ్జయినిలో సింహస్థ 2028 కుంభమేళా కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కంఠాల్ నుంచి ఛత్రీ చౌక్ మార్గంలో ఉన్న సుమారు 170 ఏళ్ల నాటి ఖడే హనుమాన్ విగ్రహాన్ని తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఇండోర్ నుంచి నిపుణులను రప్పించి ఆధునిక సాంకేతికతను ఉపయోగించినప్పటికీ, రెండు రోజులుగా విగ్రహం అంగుళం కూడా కదలలేదు. దీంతో భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తున్నారు. మరోవైపు, ఆలయ కాంపౌండ్ వాల్ కూల్చివేయడంపై స్థానికులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహా హారతి నిర్వహించారు.
పరిస్థితి సున్నితంగా ఉండటంతో అధికారులు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా విగ్రహాన్ని సురక్షితంగా, గౌరవప్రదంగా తరలించాలని నిర్ణయించారు. విగ్రహం పునాదిని పరిశీలించేందుకు గుంత తవ్వి, పురావస్తు శాఖ నిపుణులతో స్కానింగ్ చేస్తున్నారు. పునాది, లోపలి నిర్మాణం, నేల పరిస్థితిపై స్కానింగ్ నివేదిక వచ్చిన తర్వాతే విగ్రహాన్ని తరలించే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!