లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూశామని, ప్రజలు మనతోనే ఉన్నారని తెలిసిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మాకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అది కొనసాగేలా చూడాలన్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వాటికి సన్నద్ధం కావాలన్నారు.

కష్టపడితే లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావొచ్చునని, కానీ అతి విశ్వాసం వద్దని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ కోల్పోయింది, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు మరియు ప్రజలను వర్గాలుగా విభజించి శత్రుత్వం చూపుతోందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కీలకమైన రంగాల్లో పెండింగ్‌లో ఉన్న పనుల కేటాయింపుల్లో న్యాయం జరగలేదన్నారు. కావడియాత్రలో విధించిన నిబంధనలు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వెల్లడిస్తోందని, సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *