CP Radhakrishnan: సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు. పూర్తి పేరు చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్(67) ఆయన తమిళనాడుకు చెందినవారు. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది. సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీఏ నేతలంతా హాజరుకానున్నారు.
జూలై 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేశారు. లేఖలో తన ఆరోగ్య సమస్యల వల్ల పదవిని వదులుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరపడం తప్పనిసరి అయింది. అప్పటి నుంచి ధన్‌కర్ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోగా, ప్రస్తుతం ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం వెలువడుతోంది.
Internal Links:
కర్ణాటకలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు..
External Links:
నేడు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం.. ఎన్డీఏ నేతల హాజరు