Gita Gopinath: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో నెంబర్ 2 స్థానంలో ఉన్న గీతా గోపీనాథ్ ఆగస్టులో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె ఈ విషయాన్ని ఎక్స్‌లో ప్రకటిస్తూ, తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరనున్నట్లు తెలిపారు. ఐఎంఎఫ్‌లో దాదాపు ఏడేళ్ల పాటు సేవలందించిన గీతా, 2019లో చీఫ్ ఎకనామిస్ట్‌గా చేరారు. తరువాత 2022లో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఆమె IMF చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్‌గా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 1 నుంచి హార్వర్డ్‌లో ఆర్థికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు చేపట్టనున్నారు.
IMFలో చేరకముందు గీతా గోపీనాథ్ హార్వర్డ్‌లో 2005 నుంచి 2022 వరకు ఆర్థికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతకుముందు చికాగో యూనివర్సిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 2001 నుంచి 2005 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. గోపీనాథ్ సేవలను IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పొగిడారు. గీతా అసాధారణ మేధో నాయకురాలిగా, అంకితభావంతో పనిచేసే మేనేజర్‌గా ఆమెను ప్రశంసించారు. గోపీనాథ్ వారసుడి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
Internal Links:
మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
External Links:
గీతా గోపీనాథ్ సంచలన నిర్ణయం.. ఐఎంఎఫ్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి