Kamar Mohsin Sheikh: ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టే కమర్ మొహ్సిన్ షేక్ ఈసారి కూడా రెండు ప్రత్యేక రాఖీలను తయారు చేసి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారు. కమర్ షేక్ పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించి 1981లో పెళ్లి తర్వాత భారతదేశానికి వచ్చారు. గత 30 ఏళ్లుగా మోదీకి స్వయంగా తయారు చేసిన రాఖీని కడుతున్నారు. ఈసారి ఓం మరియు వినాయకుని బొమ్మలతో రెండు రాఖీలు తయారు చేశారు. ఆమె మార్కెట్‌లో రాఖీలు కొనకుండా ప్రతి ఏడాది ఇంట్లోనే తయారు చేస్తానని తెలిపింది. మోదీ ఆరెస్సెస్ వలంటీర్‌గా ఉన్న సమయంలో తొలిసారి కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, అప్పటి నుంచి వారిద్దరి మధ్య సోదర–సోదరి బంధం కొనసాగుతోందని తెలిపారు.
ఒకసారి మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని తన కోరిక నెరవేరిన విషయాన్ని, తరువాత ఆయనను ప్రధాని కావాలని ఆశించి దీవించడంతో అది కూడా నిజమైన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మోదీ మూడవసారి ప్రధానిగా కొనసాగుతుండటం తనకు గర్వంగా ఉందన్నారు. గత ఏడాది ఢిల్లీకి రాలేకపోయినా, ఈ సంవత్సరం మాత్రం ప్రధానిని కలవాలని ఆశిస్తున్నారు. భర్తతో కలిసి ప్రయాణించి, చేతితో తయారు చేసిన రాఖీని మోదీకి కట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. ప్రధాని ఆరోగ్యం బాగుండాలని, దేశానికి సేవలందిస్తూ నాలుగోసారి కూడా అధికారంలోకి రావాలని తాను ప్రార్థిస్తున్నానని ఆమె అన్నారు.
Internal Links:
నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోడీ..
External Links:
మోదీ కోసం చేతితో రాఖీ తయారుచేసిన పాకిస్థాన్ సోదరి.. ఆహ్వానం కోసం ఎదురుచూపు