కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు తాజా పరిణామాలపై కలత చెందుతున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం పోయిందని మృతురాలి తండ్రి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. “ఇంతకుముందు మమతా బెనర్జీపై ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడా భావన పోయింది. ఆమె కూడా న్యాయం చేయాలని అడుగుతున్నారు.

కానీ ఆ దిశగా ఆమె చేస్తున్నది ఏమీ లేదు. ఓవైపు ఆమె న్యాయం కావాలి అంటూనే, న్యాయం కావాలి అని నినదిస్తున్న సాధారణ ప్రజలను నిర్బంధిస్తున్నారు. ఆమె ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడంలేదు. సీసీటీవీ ఫుటేజీని బట్టి ఈ హత్య ఘటనలో సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. కానీ ఒక్కడి వల్ల ఈ ఘాతుకం జరిగి ఉండదని, ఇందులో ఇతరులు కూడా ఉండొచ్చని అందరూ అంటున్నారు. మేం మొదటి నుంచి ఇదే చెబుతున్నాం” అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *