ladakh: లడఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్రమంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా లేహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులు పోలీస్ వాహనాలను కాల్చి, బీజేపీ కార్యాలయంపై దాడి చేయడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనల్లో నలుగురి మరణానికి కారణమైన వారిపై చర్యలు తప్పవని లెఫ్టినెంట్ గవర్నర్ హెచ్చరించారు.
స్థానిక నాయకులు మాత్రం తమపై భద్రతా బలగాలే బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అనేక మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు లేహ్‌లో కర్ఫ్యూ అమలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజనతో 2019లో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతమైంది. అప్పటి నుంచి అక్కడ రాష్ట్ర హోదా కోసం నిరసనలు కొనసాగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
బీహార్ ఎన్నికలు మోడీ అవినీతి పాలన ముగింపుకు నాంది…
External Links:
‘‘సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని తగలబెట్టే యత్నం’’.. లడఖ్‌లో హింస, లేహ్‌లో కర్ఫ్యూ..