News5am, Latest News Telugu (13-06-2025): అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విమాన ప్రమాదంగా నమోదైంది. శుక్రవారం (జూన్ 13) నాటికి మృతుల సంఖ్య 297కి చేరింది, ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విశ్వాస్ రమేష్ అనే ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడటం గమనించాల్సిన విషయం. ఈ ఘటన జరిగిన తర్వాత ప్రధాని మోడీ అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌తో ప్రత్యేకంగా మాట్లాడి ధైర్యం చెప్పారు.
విశ్వాస్ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోడీ తెలుసుకున్నారు. అలాగే, అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర బాధితులను కూడా పరామర్శించారు. అనంతరం మోదీ ఘటనాస్థలాన్ని పరిశీలించి అక్కడ పని చేస్తున్న రెస్క్యూ బృందాలను కలిశారు. ఈ విషాదకర ఘటన గురించి మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఇది ఎంతో బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలకు దేశం మొత్తం సానుభూతి వ్యక్తం చేస్తుందని ట్వీట్ చేశారు.
More Latest News:
Latest News Telugu:
సుక్మాలో ఐఈడీ పేలుడులో సీనియర్ పోలీసు అధికారి మృతి, మరో ముగ్గురు గాయపడ్డారు…
కేబినెట్ భేటీలో మోడీ వ్యాఖ్య..
More Latest News Telugu: External Sources
అహ్మదాబాద్ విమానం క్రాష్ ఘటనలో 297 కు పెరిగిన మృతుల సంఖ్య.. పీఎం మోడీ పరామర్శ..