కేంద్ర బడ్జెట్ 2024పై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పంచ్ వేశారు. కుర్చీ బచావో.. మోదీ తన ప్రధానమంత్రి కుర్చీని కాపాడుకోవటానికి పెట్టిన బడ్జెట్ లా ఉందంటూ ఎత్తిచూపారు. బడ్జెట్ అంతా డొల్ల అని.. బీహార్, ఏపీ రాష్ట్రాల కోసం పెట్టినట్లు ఉందంటూ రాహుల్ గాంధీ ఎత్తిపొడిచారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు, ఆర్థిక సాయం చేశారని.. మిగతా రాష్ట్రాలకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు రాహుల్. ఉద్యోగాలపై ఫోకస్ చేశారని.. ఆదాయ పన్ను కొత్త స్లాబులు తీసుకొచ్చారని.. ఈ మూడు తప్పితే బడ్జెట్ లో ఏమైనా ఉందా అని నిలదీశారు రాహుల్ గాంధీ. ఎన్డీఏ మిత్రపక్షాలను బుజ్జగించటానికి.. మిగతా రాష్ట్రాలకు బూటకపు వాగ్దానాలు చేశారంటూ విమర్శించారు రాహుల్ గాంధీ. ఈ బడ్జెట్ సామాన్యలకు ఏ విధంగా ఉపయోగం లేదని.. కేవలం వాళ్లిద్దరు.. AAలకే ప్రయోజనకరంగా ఉందన్నారాయన. మొత్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టోను కొంత కాపీ చేసి.. మిగతాది గత బడ్జెట్ నుంచి తీసుకున్నారని.. మొత్తంగా కేంద్ర బడ్జెట్ 2024 తుస్సు అంటూ రాహుల్ గాంధీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *