Narendra Modi tokyo

Narendra Modi: భారత్–జపాన్ 15వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌కి వెళ్లారు. టోక్యో చేరుకున్న ఆయనకు జపాన్ ప్రజలు హృదయపూర్వక సాంస్కృతిక స్వాగతం పలికారు. రాజస్థానీ దుస్తులు ధరించిన జపాన్ కళాకారులు జానపద గీతాలు ఆలపించి, గాయత్రి మంత్రం పఠించి భారతీయ సంస్కృతి పట్ల తమ గౌరవాన్ని చూపించారు. ప్రధాని మోదీ వారితో మాట్లాడి, కలిసి ఫొటోలు దిగారు. ఇది కళాకారులను ఎంతో ఉత్సాహపరిచింది. కొందరు తమ ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేస్తూ, ఇది జీవితంలో మరపురాని అనుభూతి అని తెలిపారు.

రెండు రోజులపాటు జపాన్‌లో పర్యటించే మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక సహకారం, సాంకేతికత, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల బలోపేతం ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఇటీవల కెనడాలో జరిగిన జీ7 సదస్సు, లావోస్‌లో జరిగిన ఆసియాన్-ఇండియా సదస్సుల తర్వాత ఇరు దేశాల ప్రధానులు మరోసారి కలవడం ప్రత్యేకతగా నిలిచింది.

Internal Links:

కొత్త పన్ను చట్టం..

జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని మోదీ..

External Links:

టోక్యోలో మోదీకి రాజస్థానీ స్వాగతం.. గాయత్రీ మంత్రంతో పరవశించిన జపనీయులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *