News5am,Current News Telugu (14-05-2025): ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి శత్రువులకు గట్టిగా బుద్ధిచెప్పిన తర్వాత, ఎన్డీఏ కీలక భేటీ నిర్వహించనుంది. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టిన కారణాలను ఎన్డీఏ నేతలకు వివరించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిగిన ఈ ఆపరేషన్‌పై వివరాలు తెలియజేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు కూడా ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసించాయి.
అయితే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడంతో ఎన్డీఏపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం, దాని తరువాతి పరిణామాలపై ఎన్డీఏ నేతలకు వివరాలు ఇచ్చి, విమర్శలకు సమాధానం చెప్పే విధంగా ఈ సమావేశం ఉండనుంది. ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందన్న స్పష్టత ఈ భేటీలో ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాబోతున్నట్లు సమాచారం.
More Telugu News from News 5am:
Current News Telugu
రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల సమావేశం..
రాజకీయాల్లోకి రోహిత్ శర్మ..
More News: External Sources
Narendra Modi: ఈ నెల 25న ప్రధాని మోదీ కీలక సమావేశం .. ఢిల్లీకి చంద్రబాబు, పవన్