New Income Tax Bill

New Income Tax Bill: భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా మార్చింది. 1961 చట్టం రద్దు చేసి, కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను ప్రవేశపెట్టారు. ఇది 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పన్ను రేట్లు మారలేదుగానీ, నియమాలు సులభంగా అర్థమయ్యేలా చేశారు. పాత TDS, TCS 71 విభాగాలను కలిపి 11 విభాగాలుగా మార్చారు. ఎవరు ఎంత పన్ను చెల్లించాలి, ఎవరికి మినహాయింపు అనే వివరాలు ఒకే చోట ఉన్నాయి. ఉద్యోగుల ప్రయాణ భత్యంపై మినహాయింపు పెరిగింది. టాక్సీ, బస్సు వంటి ప్రయాణ ఖర్చులను కూడా పన్ను రహితంగా పరిగణిస్తారు. బంగారం, వెండి, నగదు మాత్రమే కాకుండా బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులూ పన్ను పరిధిలోకి వచ్చాయి.

కొత్త చట్టం ప్రకారం పన్ను అధికారులు ఇప్పుడు డిజిటల్ పత్రాలను కూడా తనిఖీ చేయగలరు. ఇమెయిల్, మొబైల్, ల్యాప్‌టాప్, ఆన్‌లైన్ ఖాతాలు, సోషల్ మీడియా అన్నీ పరిశీలనలోకి వస్తాయి. విదేశీ లేదా అనుబంధ కంపెనీల ద్వారా ఆదాయాన్ని దాచేవారికి కఠినమైన నియమాలు పెట్టారు. ఇకపై ఒక కంపెనీలో 26% వాటా ఉండటం లేదా నిర్వహణ, డబ్బు, నియంత్రణ మరొక కంపెనీ చేతిలో ఉండటం, ఈ రెండు షరతుల్లో ఒక్కటి సరిపోతుంది. ఈ మార్పులు పన్ను ఎగవేత తగ్గించడానికీ, వ్యవస్థను సులభంగా చేయడానికీ తీసుకొచ్చారు.

Internal Links:

జ‌పాన్‌లో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని మోదీ..

నేడు అహ్మదాబాద్‌లో మోడీ పర్యటన…

External Links:

కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *