Pariksha Pe Charcha Pm Narendra Modi

Pariksha Pe Charcha Pm Narendra Modi: లక్ష్యాలు ఎప్పుడూ సులభంగా ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ 9వ సీజన్‌లో భాగంగా బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. గుజరాత్, కోయంబత్తూర్, రాయ్‌పూర్, గౌహతి, ఢిల్లీ నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

మార్కులకే ప్రాధాన్యం ఇవ్వాలా లేదా నైపుణ్యాలకా అనే ప్రశ్నకు మోదీ స్పందించారు. రెండింటి మధ్య సమతుల్యత ఉండాలని చెప్పారు. జ్ఞానంతో మొదలయ్యే నైపుణ్యాలతో పాటు జీవిత నైపుణ్యాలు కూడా చాలా అవసరమని తెలిపారు. నిద్ర, మేల్కొనే సమయం, వ్యాయామం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని విద్యార్థులను కోరారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

లక్ష్యాలెప్పుడూ సులభంగా ఉండకూడదు.. ‘పరీక్షా పే చర్చ’’లో మోడీ సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *