Petrol-Diesel price

Petrol-Diesel price: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇటీవల గృహ, వాణిజ్య గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో వదంతులు విస్తృతంగా వ్యాపించాయి. అయితే ముడి చమురు ధరలు పెరిగినా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే నిర్ణయం లేదని కేంద్ర వర్గాలు తెలిపినట్లు సమాచారం. ధరల పెరుగుదల ప్రభావాన్ని తాత్కాలికంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరించాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో వాహనదారులకు కొంత ఊరట లభించింది.

గత నెల 28 నుంచి పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయగా.. ప్రతీకారంగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేసింది. అలాగే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు రవాణా నిలిచిపోయి ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం ధరలను కేంద్రం పెంచకుండా నిలిపినట్లు తెలుస్తోంది. కానీ అంతర్జాతీయ పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

వాహనదారులకు కేంద్రం శుభవార్త.. వదంతులపై కీలక ప్రకటన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *