PM Modi Launches Hpv Vaccination: ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ పర్యటనలో అజ్మీర్‌లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా వేయనున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ఈ వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. నేటి నుంచి ఆరోగ్య కేంద్రాల్లో బాలికలకు టీకాలు వేయడం ప్రారంభమవుతుంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. సుమారు 1.15 కోట్ల బాలికలకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా టీకా వేయనున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఉప-జిల్లా, జిల్లా ఆస్పత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..
External Links:
రాజస్థాన్‌లో HPV వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ