PM modi visit to Japan: జపాన్‌లో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు అని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రం మిశ్రీ తెలిపారు. ఆగస్టు 29న ఆయన జపాన్ చేరుకుని, అక్కడి ప్రధాని షిగేరు ఇషిబాతో భేటీ కానున్నారు. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఎనిమిది సార్లు జపాన్ వెళ్లిన మోదీ, రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జపాన్ పర్యటన అనంతరం ఆయన నేరుగా చైనాకు వెళ్తారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ భారత్-జపాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయని, వాటికి సంబంధించిన అంశాలను ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. క్వాడ్ దేశాల్లో భారత్, జపాన్ కీలకమైనవని గుర్తుచేశారు. జపాన్ పర్యటన పూర్తయ్యాక మోదీ చైనాలోని తియాంజిన్ నగరానికి వెళ్లి, ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరిగే షాంఘై సహకార సంస్థ మీటింగ్‌లో పాల్గొంటారు.
Internal Links:
నేడు అహ్మదాబాద్‌లో మోడీ పర్యటన…
ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్..
External Links:
జపాన్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..