Shubhanshu Shukla: ఇస్రో-నాసా సంయుక్త ప్రైవేట్ మిషన్ “ఆక్సియం-04” కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన భారతీయ అంతరిక్షయాత్రికుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, తన సిబ్బందితో కలిసి భూమికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఈ మిషన్‌లో భారత విజ్ఞాన రంగం సాధించిన మరో గొప్ప విజయాన్ని సూచిస్తోంది. “యాక్సియం-4” మిషన్‌లో భాగంగా, “అన్‌డాకింగ్” ప్రక్రియ నేడు (జూలై 14) మధ్యాహ్నం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది. శుభాంశు శుక్లాతో పాటు అమెరికా నుంచి పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ-విస్నియెస్కీ, హంగరీకు చెందిన టిబోర్ కాపు కూడా పాల్గొన్నారు. “Axiom Space”, “NASA”, “SpaceX” సంయుక్తంగా నిర్వహించిన ఈ మిషన్‌లో శాస్త్రీయ ప్రయోగాలు, శరీరపరమైన పరీక్షలు, శిక్షణలన్నీ పూర్తయ్యాక ఇప్పుడు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతోంది.
ఈ ప్రయాణంలో అంతరిక్షనౌక “Crew Dragon” ద్వారా అంతరిక్షయాత్రికులు భూమికి తిరిగిరానున్నారు. మిషన్ క్యాప్సూల్ రేపు (జూలై 15) మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ల్యాండ్ అవుతుంది. దీనిని కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఇది “Axiom Space” చేపట్టిన నాలుగో ప్రైవేట్ మిషన్ కావడంతో, అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థల పెరుగుతున్న పాత్రకు ఇదొక మైలురాయి. భారత్ తరపున శుభాంశు శుక్లా భాగస్వామ్యం వహించడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
Internal Links:
మోడీ టూర్‌పై పంజాబ్ సీఎం సంచలన వ్యాఖ్యలు..
రాజస్తాన్ లో కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్..
External Links:
ఐఎస్ఎస్ కి వీడ్కోలు!.. శుభాంశు శుక్లా నేడు భువి పైకి తిరుగు ప్రయాణం..