sir creek india pakistan: సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టి సమాధానం ఇస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. విజయదశమి సందర్భంగా గుజరాత్ భుజ్ ఎయిర్ బేస్‌లో జరిగిన శస్త్రపూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. 1965 యుద్ధంలో భారత్ లాహోర్ వరకు వెళ్లగలిగిందని గుర్తుచేసి, కరాచీకి వెళ్లే మార్గం సర్ క్రీక్ గుండా వెళుతుందని పాకిస్థాన్ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ బట్టబయలైందని, భారత్ ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ నష్టం కలిగించగలదని ఆయన హెచ్చరించారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సర్ క్రీక్ వివాదం కొనసాగుతూనే ఉందని, భారత్ ఎప్పుడూ చర్చల ద్వారా పరిష్కారం కోరుతుందని కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని రాజ్‌నాథ్ అన్నారు. అక్కడ సైనిక మౌలిక సదుపాయాలు పెంచడం వారి దుష్టపన్నాగాలని విమర్శించారు. గాంధీ జయంతి రోజున గాంధీజీని స్మరించుతూ, ఆయన నైతిక స్థైర్యం ప్రతీక అని చెప్పారు. మన సైనికులు నైతిక బలంతో పాటు ఆయుధ శక్తి కూడా కలిగివుండటంతో ఎవ్వరూ వారిని ఎదుర్కోలేరని అన్నారు. విజయదశమి నాడు శస్త్రపూజ చేయడం మన సన్నద్ధతకు, సైనికుల పట్ల గౌరవానికి సూచిక అని చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం చేసిన త్రివిధ దళాలను ఆయన అభినందించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో హింస..
External Links:
సర్ క్రీక్ వద్ద తోక జాడిస్తే తాట తీస్తాం: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ వార్నింగ్