కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. కడుపు సంబంధిత సమస్యలతో ఆమె గురువారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరినట్లు ఆలస్యంగా తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
శుక్రవారం సాయంత్రం ఆమెను ఇంటికి పంపిస్తామని ఆసుపత్రి బోర్డు మేనేజ్‌మెంట్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ప్రస్తుతం ఆమె గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంరక్షణలో ఉంది. ఆమెకు కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. గత డిసెంబర్‌లో సోనియాకు 78 ఏళ్లు నిండాయి. ఫిబ్రవరి 13న పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో భాగంగా సోనియా చివరిసారిగా బహిరంగంగా కనిపించారు.