ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారీ భూకంపాలను చవిచూశాయి. మయన్మార్ మరియు బ్యాంకాక్‌లో ఈరోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. దీని వల్ల పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ భూకంపాలు బ్యాంకాక్ మరియు మయన్మార్‌లతో పాటు భారతదేశం, చైనా, బంగ్లాదేశ్ మరియు దావోస్‌లలో కూడా పెద్ద భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల నుండి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి.