Breaking Telugu News

News5am, Breaking News Bulletin (15-05-2025): భారత్‌, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ‘ఆపరేషన్ సిందూర్‌’ వివరాలను వెల్లడించిన సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్‌ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఉగ్రవాదులు మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేశారని, అదే సమయంలో ప్రధాని మోదీ పాక్‌కు ఒక ముస్లిం సోదరిని పంపించి పాఠం చెప్పారు అని మంత్రి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాయి. హైకోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు నమోదవగా, విజయ్‌ షా ఈ కేసును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు.

సుప్రీంకోర్టు మంత్రి పిటిషన్‌ను విచారణకు తీసుకున్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముందు హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఇలాంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇదే సమయంలో జాతీయ మహిళా కమిషన్‌ కూడా మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. సాయుధ బలగాల్లో పనిచేస్తున్న మహిళా అధికారుల పట్ల గౌరవంతో వ్యవహరించాలని, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.

More Telugu News:

Breaking News Bulletin

రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’..

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ..

More Telugu News: External Sources

https://www.ap7am.com/tn/829389/supreme-court-anger-over-ministers-remarks-on-colonel-sofia-qureshi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *