Telugu Latest News Online

News5am Telugu News Online(10/05/2025) : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరంగా మారుతున్నాయి. భారత్ “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాక్‌కు గుణపాఠం చెబుతున్నా, పాకిస్తాన్ వైఖరి మారడం లేదు. భారత ఆర్మీ చేస్తున్న మెరుపు దాడులతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అయినా సరిహద్దుల్లో పాక్ మళ్లీ దాడులకు పాల్పడుతోంది. భారత దళాలు కూడా సమర్ధంగా ఎదురుదాడులు నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు.

ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“భారత్, పాకిస్తాన్‌ల మధ్య తక్షణ కాల్పుల విరమణకు మేము మధ్యవర్తిత్వం వహించాం. రెండు దేశాలు కూడా సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయి. ఇరు దేశాలకు అభినందనలు,” అని ట్రంప్ ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే, దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు

Telugu News Online

ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య – శోభిత…

ఎఫ్ఐఆర్ లను కొట్టివేసేందుకు నిరాకరించిన హైకోర్టు…

More Telugu News : External Sources

https://tv9telugu.com/national/india-pakistan-agreed-to-immediate-ceasefire-after-us-mediation-says-us-president-donald-trump-1532566.html

By Anusha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *