కిడ్నాపర్ చెర నుంచి విడుదలైన ఓ బాలుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన తనూజ్ చాహర్ సస్పెండ్ హెడ్ కానిస్టేబుల్ (రిజర్వ్ పోలీస్) రాజస్థాన్‌కు చెందిన పృధ్వీ అనే చంటిబిడ్డను నెలల ప్రాయంలోనే ఆమె తల్లికి దూరం చేసి ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ ఉపయోగించకుండా ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో బిడ్డను తిప్పాడు. అయితే కిడ్నాప్‌కు గురైన చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దాదాపు 14 నెలల తర్వాత అతను ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇటీవల తనూజ్ చాహర్‌ను ఆలీఘర్ లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అయితే 14 నెలల పాటు తనూజ్ చాహర్‌ వద్దే పెరగడంతో ఆ బాలుడు తన తల్లిదండ్రులను గుర్తించలేదు. దీంతో తనూజ్‌ను వదిలి వెళ్లడానికి మారాం చేశాడు. అలా ప్రయత్నించగా పోలీసులు వారిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి మారాం చేస్తున్నా పోలీసులు బలవంతంగా వారికి అప్పగించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చిన్నారి తల్లి పూనమ్ చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్ ఒత్తిడి చేశాడని, ఆమె నిరాకరించడంతోనే బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *