కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యం భారీ నష్టాన్ని కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మృతి చెందగా, 152 మంది గల్లంతయ్యారు. ఇటీవల వయనాడ్ ప్రాంతంలో భూమి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. వయనాడ్ , పాలక్కాడ్, కోజికోడ్‌లో భూమి నుండి వింత శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కొండచరియలు విరిగిపడిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన జనం భూమి నుంచి వస్తున్న శబ్ధాలతో మరో విపత్తు సంభవిస్తుందేమోనని భయపడుతున్నారు.

ఈ ఉదయం 10.30 గంటలకు భూమి నుంచి శబ్దాలు రావడంతో పాఠశాలలోని విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు చోటుచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భూకంపం వచ్చిందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఈ శబ్దాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, భూకంపం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని సెంటర్ ఫర్ సిస్మాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ స్పష్టం చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *