విజయవాడ: ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు . పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.