విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆయన నివాసంలో వేదపండితులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలని కోరుతూ తాడేపల్లిలో 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం నల్లపెద్ది శివరామప్రసాద శర్మ, గౌరవజ్జుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 45 మంది వేదపండితులు ఈ క్రతువులో పాల్గొన్నారు. పండితులు ఆయనకు యాగం తీర్థం, ప్రసాదాలు అందజేశారు. వారి వెంట యాగం నిర్వాహకులు అరిమండ వరప్రసాదరెడ్డి, విజయ శారదారెడ్డి, పడమట సురేష్ బాబు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *