ములుగు : ములుగు జీవంతరావు పల్లి, బండారుపల్లి గ్రామాలను ములుగు మున్సిపాలిటీలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సోమవారం సీఎం చిత్రపటానికి, మంత్రి సీతక్కకు పాలాభిషేకం చేశారు. ములుగు మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ములుగు ప్రజలకు మంత్రి సీతక్క మున్సిపాలిటీ కలను సాకారం చేయడంతో ములుగు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని, సీతక్క జన్మదినం సందర్భంగా తమకు శుభవార్త రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ములుగు పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భానోత్ రవిచందర్, మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *