తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్తగా స్థాపించిన తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ జెండాను ఆగస్టు 22, గురువారం నాడు విడుదల చేశారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు చెన్నై పనైయూర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను విజయ్ ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ సిద్ధాంతాలను ప్రకటించారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలిపారు. ఫిబ్రవరిలో పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని వెల్లడించారు.

ఎరుపు, పసుపు రంగుల్లో జెండా ఉంది. జెండా మధ్యలో సూర్యకిరణాలు, పక్కనే రెండు ఏనుగులు అటూ, ఇటూ ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీ జెండా తమిళ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు, పార్టీ జెండాతో పాటు పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *