ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ప్రజా సమస్యలపై ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నేతలు వినతులు స్వీకరించనున్నారు. నేటి నుంచి ప్రతిరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యల వినతి పాత్రలను స్వీకరించి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయనున్నారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పార్టీ కార్యాలయంలో తప్పనిసరిగా మంత్రులు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల, ప్రజల కోసం కేంద్ర కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. 10 రోజులు పాటు రోజుకో మంత్రి , ఒక సీనియర్ టీడీపీ నేత అందుబాటులో ఉండే విధంగా అధిష్ఠానం కార్యాచరణ రూపొందించింది. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
ఉచిత ఇసుక విధానంలో అనవసరంగా జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని మంత్రులకు , ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేబినెట్ భేటీ ముగిశాక, జరిగే టేబుల్ సమావేశంలో రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తాజగా అమలు చేసిన ఉచిత ఇసుక, అక్టోబరు తర్వాత ఇసుక క్వారీలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం డంప్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందని వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరం అవుతుంది అని అంచెనా వేసినట్లు మంత్రులతో తెలిపారు. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక సమకూరుతుంది అని తెలిపారు. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు తమ శాఖల సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో బడ్జెట్ లోటు ఉందని వాటిని దృష్టిలో ఉంచుకొని మంత్రులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మంత్రులు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని తెలిపారు.