ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే , కాగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారంగా ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువతకు చెప్పినవి చెప్పినట్లుగా వెంటనే అమలు చేసేందుకు సిద్ధమవతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం అందులో భాగంగా ఇప్పటికే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు నాలుగు వేల రూపాయల పింఛను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా కాంటిన్లు వంటివి అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిరుద్యోగ యువతకు చెప్పిన హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమయిందని తెలిసింది. ఈ మేరకు ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో బడ్జెట్ లెక్కతీసే పనిలో ఉన్నారు.
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే వీలయినంత త్వరగా ఈ నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది అని పలు కధనాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు? వారికి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఎంత బడ్జెట్ అవసరమవుతుందన్న దానిపై కసరత్తుచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జిల్లాల వారీగా నిరుద్యోగ యువత వివరాలను తెప్పించుకుని వారికి త్వరలోనే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.